అయితే మనిషిలో ఉన్న ఇలాంటి విచక్షణ జ్ఞానమే భూమ్మీద ఉన్న అన్ని జీవుల్లోకెల్లా మనిషి తెలివైన జీవి అని పేరు వచ్చేలా చేసింది. దీంతో ఇక ఈ సృష్టిలో తెలివైన జీవి మనిషి అని చెబుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. కానీ మనుషులను మించిన తెలివి ఏకంగా పావురాల్లో కూడా ఉంటుందట. పావురాల్లో మనుషులను మించిన తెలివి ఉండడమేమిటి బాసు జోక్ చేస్తున్నారా అంటారా.. ఏకంగా శాస్త్రవేత్తలు ఈ విషయంపై అధ్యయనం చేసి మనుషులకంటే పావురాలు తెలివైనవి అని బల్ల గుద్ది మరి చెబుతున్నారు. ఇక ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
శిక్షణ ఇస్తే పావురాలు ఏ విషయం అయినా ఎంతో సులభంగా నేర్చుకుంటాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ లాగా అవి కూడా కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలవు అంటూ కొలంబస్ హోహియో స్టేట్ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఏఐలో వాడే బ్రూట్ ఫోర్స్ విధానాన్ని ఇక పావురాలు పాటిస్తున్నాయి అంటూ పేర్కొన్నారు. నాలుగు పావురాలపై పరీక్షలు చేసిన వారు ఇక ఈ విషయాన్ని కనుగొన్నట్లు చెప్పుకొచ్చారు. కొన్ని అంశాలను మనిషి కంటే వేగంగా సమర్థవంతంగా పావురాలు నేర్చుకోగలవు అంటూ తెలిపారు శాస్త్రవేత్తలు.