ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ అభిమానులందరికీ కూడా ఇటీవలే ఊహించని షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను సారధ్య బాధ్యతలు నుంచి తప్పిస్తూ ఆ జట్టు యాజమాన్యం ట్విస్ట్ ఇచ్చింది. ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ గా.. కొనసాగుతున్న రోహిత్ ను పక్కన పక్కన పెట్టడం ఏంటి అని అటు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా అవాక్కయ్యారు.


 రోహిత్ శర్మను ఇలా కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా నియమిస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఇక ఈ నిర్ణయంతో అభిమానులు షాక్ అవ్వక ముంబై ఇండియన్స్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్ శర్మ అటు వచ్చే ఏడాది జరగబోయే టి20 కెప్టెన్సీ కూడా కోల్పోయే అవకాశం ఉంది అని టాక్ వినిపించింది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి టి20లకు పూర్తిగా దూరంగా ఉన్నాడు రోహిత్ శర్మ.


 దీంతో వచ్చే ఏడాది వరల్డ్ కప్ కోసం అతను మళ్ళీ టి20లలోకి వస్తాడా లేదా అనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఈ విషయంలో రోహిత్ శర్మ అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్ అందింది. వచ్చే ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ కు భారత జట్టు కెప్టెన్ గా మొదటి ఛాయిస్ రోహిత్ శర్మే అంటూ బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు నేషనల్ మీడియా తెలిపింది  హిట్ మ్యాన్ ఓకే అంటే అతనికే కెప్టెన్సీ దక్కనుందట. అయితే ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యానే ఇక టి20 వరల్డ్ కప్ కోసం పూర్తిస్థాయి కెప్టెన్గా నియమిస్తారు అంటూ వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: