సాధారణంగా క్రికెట్లో టి20 వన్డేలతో పాటు టెస్ట్ ఫార్మాట్ అనే మూడు ఫార్మాట్లు ఉంటాయి అన్న విషయం తెలిసిందే  అయితే టి20 వన్డే ఫార్మాట్ ను పరిమిత ఓవర్లో ఫార్మాట్గా పిలుచుకుంటే.. అటు టెస్ట్ ఫార్మాట్ ను మాత్రం సాంప్రదాయమైన క్రికెట్ గా లేదంటే సుదీర్ఘమైన ఫార్మాట్గా పిలుచుకుంటూ ఉంటారు. అయితే పరిమిత ఓవర్లో ఫార్మాట్ కంటే టెస్ట్ ఫార్మాట్లో అత్యుత్తమ ఘనంగాలు నమోదు చేయాలని ప్రతి ఒక్క ప్లేయర్ కూడా భావిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక టెస్ట్ ఫార్మాట్లో ఆడటం అనేది ఏకంగా ప్రతిభకు సవాలు లాంటిది.



 ఆటగాళ్ల ఫిట్నెస్ కు ప్రతిభకు టెస్ట్ ఫార్మాట్ ఎప్పుడు అనూహ్యమైన సవాలను విసురుతూనే ఉంటుంది. ఇక అలాంటి సవాళ్లను  ఎదుర్కొన్నప్పుడే ఆటగాడు ఏకంగా స్టార్ ప్లేయర్గా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి  అయితే సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువ వికెట్లు పడగొట్టడం అనేది అంత సులభమైన విషయం కాదు. కానీ ఇక నేటితరం క్రికెటర్లలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ లియోన్ భారత స్పిన్నర్ అశ్విన్ ఇద్దరు కూడా 500 వికెట్లకు చేరువలో ఉన్నారు. అయితే పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో లియోన్ తప్పకుండా 500 వికెట్ల మార్క్ అందుకు ఉంటాడని అందరూ భావించారు.

 అనుకున్నట్లుగానే ఇటీవలే జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో  లియోన్ టెస్ట్ ఫార్మాట్ లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి. పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ పై ఐదు వికెట్లు తీసాడు. దీంతో ఇక అతను 500 వికెట్లు క్లబ్లో చేరిపోయాడు. 2011లో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన లియోన్ 123 టెస్ట్ మ్యాచ్లలో 500 వికెట్ల ఘనత సాధించాడు. ఇక ఈ రికార్డుతో ఆస్ట్రేలియా తరపున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానానికి చేరాడు. ఇక ఈ లిస్టులో షేన్ వార్న్ 703, మేక్ గ్రాత్ 563 వికెట్లతో లియోన్ కంటే ముందు స్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: