టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా టీమ్ ఇండియాకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ టోర్నీని రెండుసార్లు అందించిన ఘనత కేవలం ధోనికే దక్కింది అని చెప్పాలి. తన ప్రశాంతమైన కెప్టెన్సీ తో మిస్టర్ కూల్ అనే ఒక బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. ప్రస్తుతం భారతదేశంలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు ఒకప్పుడు ధోని కెప్టెన్సీ లోనే మంచి క్రికెటర్లుగా ఎదిగారు.


 ఎలాంటి ఒత్తిడి ఉన్న సరే ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఇక తన చిరునవ్వుతోనే ప్రత్యర్ధులను భయపెడుతూ ఉంటాడు మహేంద్రసింగ్ ధోని. ఇక వికెట్ల వెనకాల ఉంటూ తన వ్యూహాలతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ ను తన వైపుకు తిప్పుకోగల సత్తా మహేంద్రసింగ్ ధోని సొంతం. అయితే ధోని నుంచి సారధ్య బాధ్యతలు అందుకున్న విరాట్ కోహ్లీ మాత్రం కెప్టెన్సీ విషయంలో పూర్తిగా ధోనికి భిన్నమైన వాడు. ఏకంగా తన దూకుడుతో అటు భారత జట్టులో దూకుడు వచ్చేలా చేసాడు విరాట్ కోహ్లీ.


  వరల్డ్ కప్ గెలిపించలేకపోయాడు అనే కారణం తప్ప అతనికి కెప్టెన్సీకి వంక పెట్టాల్సిన అవసరమే లేదు. అయితే విరాట్ కోహ్లీ, ధోని కెప్టెన్సీ గురించి స్పందించిన మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ఫేవరెట్ కెప్టెన్ ధోని విరాట్ కోహ్లీ కాదు సౌరబ్ గంగూలీ అంటూ చెప్పుకొచ్చాడు పార్దీవ్ పటేల్. విరాట్ కోహ్లీ, గంభీర్  ఎప్పుడు గౌరవంగానే ప్రవర్తిస్తారు. దేశం కోసం ఆడేటప్పుడు వారిలో దూకుడు ఉంటుంది. నేను గంభీర్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ కోహ్లీతో ఆర్సిబి జట్టులో ఆడా.. ఇక తమ జట్టును గెలిపించాలని ఈ ఇద్దరు బలంగా కోరుకుంటారు. విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకునే విధానం సహచరుల్లో స్ఫూర్తిని నింపే తీరు నాకు ఎంతగానో ఇష్టం. ధోని, కోహ్లీ ఇద్దరు విజయవంతమైన సారథులే కానీ నాకు బెస్ట్ కెప్టెన్ గంగూలిని అంటూ చెప్పుకొచ్చాడు పార్థివ్ పటేల్.

మరింత సమాచారం తెలుసుకోండి: