ప్రస్తుతం భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది టీమిండియా. ఇక మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో కూడా అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. ఒక ఫైనల్ మ్యాచ్లో ఓటమి తప్ప మిగతా ప్రస్థానం మొత్తం అద్భుతంగా సాగింది. అంతకుముందు ఆసియా కప్ లో కూడా అదరగొట్టి విజయం సాధించింది. అయితే ఇలా టీమిండియా సీనియర్ జట్టు అదరగొడుతూ ఉండగా ఇటీవల భారత అండర్ 19 జట్టు ఆసియా కప్ లో పాల్గొంది.


 అయితే ఈ ఏడాది పాకిస్తాన్, శ్రీలంక వేదికలలో జరిగిన ఆసియా కప్ లో అటు భారత జట్టు టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 మెన్స్ ఆసియా కప్ టోర్నీలో కూడా టీమిండియా కుర్రాళ్ళు అదరగొట్టి టైటిల్ విజేతగా నిలుస్తారు అని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో భారత కుర్రాళ్లకు చేదు అనుభవం ఎదురయింది అని చెప్పాలి. ఏకంగా సెమీఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి చివరికి ఇంటి బాట పట్టింది టీం ఇండియా.



 అయితే ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో యూఏఈని చిత్తుగా ఓడించింది బంగ్లాదేశ్. ఈ ఫైనల్ మ్యాచ్ వారు వన్ సైడ్ అన్న విధంగానే జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 50 ఓవర్లలో 282 పరుగులు చేసింది. అయితే లక్ష చేదనలో యూఏఈ తడబాటుకు గురైంది. దీంతో బంగ్లాదేశ్ జట్టుకు ఎక్కడ పోటీ ఇవ్వలేకపోయింది.  87 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా బంగ్లాదేశ్ జట్టు 195 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సెంచరీ తో చెలరేగిన రెహమాన్ షిబ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: