ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన జడ్డుగా కొనసాగుతూ ఉంది ఆస్ట్రేలియా. ఎంతో ప్రతిభ గల ప్లేయర్లు కలిగి ఉన్న ఈ జట్టు ఎప్పుడూ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక వరల్డ్ క్రికెట్లో ఎలాంటి టీం పైన అయినా సరే విజయం సాధించవచ్చు. కానీ అటు ఆస్ట్రేలియాను ఓడించడం మాత్రం అంత సులువైన విషయం కాదు అన్నది ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. సాధారణంగా ఆస్ట్రేలియా జట్టు ఇతర దేశాల పర్యటనలకు వెళ్ళినప్పుడే ఆ టీం ని ఓడించడం చాలా కష్టం. ఎన్ని వ్యూహాలతో బరిలోకి దిగిన ఆ జట్టు ప్రదర్శనతో ఎప్పుడూ అదరగొడుతూ ఉంటుంది.


 కేవలం ద్వైపాక్షిక సిరీస్లలో మాత్రమే కాదు అటు కీలకమైన ఐసీసీ టోర్నీలలో సైతం ఆస్ట్రేలియా సత్తా చాటుతూ ఉంటుంది. ఇక ఈ ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇందుకు నిదర్శనం అని చెప్పాలి. మొదటి నుంచి పడుతూ లేస్తూ ప్రస్తానాన్ని కొనసాగించిన ఆస్ట్రేలియా ఫైనల్ లో మాత్రం భారత జట్టును ఓడించి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఇక ప్రపంచ క్రికెట్లో ఆరుసార్లు వరల్డ్ కప్ టైటిల్ అందుకున్న జట్టుగా కూడా కొనసాగుతుంది. ఇక ఇలాంటి గణాంకాలు నమోదు చేస్తుంది కాబట్టి ఆస్ట్రేలియాని ఓడించడం అంత సులువైన విషయం కాదు అని క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు.


 అయితే ఇతర దేశాలకు పర్యటనలకు వెళ్ళినప్పుడే ఓడించడం కష్టం. అయితే ఇక వారి సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో తలబడితే కంగారులను అడ్డుకోవడం మామూలు విషయం కాదు. ఇక ఇటీవల ఇది మరోసారి నిరూపితమైంది. ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ తొలి టెస్ట్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర చర్చ తెరమీదకి వచ్చింది. ఆస్ట్రేలియా గత ఏడేళ్లలో ఆడిన గత 35 టెస్టులలో భారత్ మాత్రమే ఆస్ట్రేలియాను ఓడించింది. అది కూడా నాలుగు సార్లు. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి ఆ టీమ్ తో టెస్ట్ సిరీస్ ఆడిన ఏ టీమ్ కూడా ఆస్ట్రేలియా అని ఇప్పటివరకు ఓడించలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: