అయితే ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారిలో మహా మహా ప్లేయర్లు ఉన్నప్పటికీ ఐసీసీ ఎక్కడ వారి విషయంలో వెనకడుగు వేయదు అని చెప్పాలి. అయితే ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ ఓపెనర్ అయిన ఉస్మాన్ ఖవాజా విషయంలో ఐసీసీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెర్త్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా భుజానికి నల్ల రిబ్బన్ ధరించి బ్యాటింగ్ చేసాడు ఈ క్రమంలోనే పాలస్తీనాకు మద్దతు తెలిపేందుకే తాను ఇలా నల్ల రిబ్బన్ కట్టుకొని బ్యాటింగ్ చేశాను అంటూ కవాజా చెప్పుకొచ్చాడు.
అయితే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ఆడుతున్న ప్లేయర్ ఎవరైనా ఇలా నల్ల రిబ్బన్ కట్టుకొని ఆటను కొనసాగించాడు అంటే ఆ దేశ క్రికెట్ బోర్డుతో పాటు ఐసిసి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఖావాజా క్రికెట్ ఆస్ట్రేలియా తో పాటు ఐసీసీ అనుమతి కూడా తీసుకోలేదు. దీంతో ఈ విషయాన్ని ఐసీసీ తప్పు పట్టింది. ఈ క్రమంలోనే ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను.. అతనిపై చర్యలు ఉంటాయి అన్న విషయాన్ని తెలిపింది అయితే గతంలో కూడా షూ మీద ఫ్రీడం అనేది మానవుల హక్కు. అందరి జీవితాలు సమానమే ఇలాంటి మెసేజ్లతో కనిపించి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.