గత కొంతకాలం నుంచి ప్రత్యర్ధులను చిత్తు చేస్తూ వరుస విజయాల సాధిస్తూ అదిరిపోయే ప్రదర్శన చేస్తున్న టీమ్ ఇండియాకు ఇటీవలే ప్రత్యర్థి చేతిలో ఘోర ఓటమి ఎదురైంది. ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఇక ఇక్కడ వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే ఆతిథ్య సౌతాఫ్రికా ఇక టీమిండియా మధ్య అటు డిసెంబర్ 26వ తేదీ నుంచి కూడా టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది.


 అయితే ఇప్పటివరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్ లో విజయం సాధించలేకపోయింది టీమిండియా. ఈ క్రమంలోనే రోహిత్ కెప్టెన్సీలో ఈ నిరీక్షణకు తెరపడుతుంది అని అందరూ ఊహించారు. కానీ ఊహించని రీతిలో భారత జట్టుకు మరోసారి చేదు అనుభవమే ఎదురయింది. సొంత గడ్డపై సఫారీ జట్టును చిత్తు చేస్తూ సిరీస్ ను కైవసం చేసుకోవాలని కలలు కన్న టీమ్ ఇండియాకు అది కలగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఇటీవలే మొదటి టెస్ట్ మ్యాచ్లో 31 పరుగులు సహా ఏకంగా ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది టీమిండియా.


 ఈ క్రమంలోనే ఈ ఓటమిని అటు భారత జట్టు అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అత్యంత పేలవమైన క్రికెట్ ఆడటం వల్లే తొలి టెస్ట్ లో ఓడిపోయాం అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సెంచూరియాన్ లో జరిగిన మ్యాచ్ లో గెలిచేందుకు అవసరమైన ఆటను భారత జట్టు ఆడలేదు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. టెస్టులో గెలవాలంటే అందరూ కలిసికట్టుగా ఆడాలి. కానీ మేము పరిస్థితులకు తగ్గట్లుగా ఆటను మార్చుకోలేకపోయాం అంటూ రోహిత్ తెలిపాడు. కాగా రెండోవ టెస్ట్ మ్యాచ్ జనవరి మూడవ తేదీ నుంచి జరగబోతుంది ఇక ఆ మ్యాచ్ లో అయినా టీమిండియా ప్రదర్శన మారుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: