ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆతిథ్య సఫారీ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి మ్యాచ్ ముగిసింది. ఈ మొదటి మ్యాచ్ లో భారత జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది అని చెప్పాలి. 32 పరుగులతో పాటుఒక ఇన్నింగ్స్ తేడాతో భారత జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలోనే  టీమిండియా ఓటమి పట్ల అటు అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా గడ్డపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది టీమిండియా. కనీస పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి.


 అయితే మొదటి మ్యాచ్ లో ఘోర ఓటమితో పరువు పోగొట్టుకున్న టీమిండియా అటు ఈనెల మూడవ తేదీ తేదీ నుండి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ కోసం సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ రెండో టెస్ట్ మ్యాచ్లో తుది జట్టులో ఎవరు ఉంటే బాగుంటది అనే విషయంపై ఎంతో మంది టీమిండియా మాజీ ఆటగాళ్ళు తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు భారత మాజీ ఫేసర్ ఇర్ఫాన్ పఠాన్ కీలకమైన సూచన చేశాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో మరో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను తుదిజట్టులోకి తీసుకోవాలి అంటూ సూచించాడు.



 ఇటీవల స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. సెంచూరియాన్  పిచ్ పై  ఆశించిన దానికంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు అశ్విన్. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఏడవ స్థానంలో జడేజా బ్యాటింగ్ను మిస్ అయ్యాం. అలాగే ప్రసిద్ కృష్ణ స్థానంలో ముఖేష్ కుమార్ ను తీసుకోవడంపై ఒకసారి ఆలోచన చేయాలి. లేదంటే రోహిత్ శర్మ అదే బౌలింగ్ దళంతో ఆడిన పర్వాలేదు. కానీ మార్పులు చేయాలనుకుంటే మాత్రం ఈ రెండు మార్పులు చేస్తే బాగుంటుంది అంటూ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. మొదటి టెస్ట్ లో విఫలమైన ప్రసిద్ కృష్ణ పై నమ్మకం ఉంటే అతన్ని రెండో టెస్టులో కూడా కొనసాగించాలి అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: