ఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక పొట్టి ఫార్మాట్లో ఉండే ఉత్కంఠను ఎంజాయ్ చేస్తూ ఇక ప్రపంచ కప్ టోర్నీలోని ప్రతి మ్యాచ్ నీ కూడా వీక్షించాలని ప్రతి ఒక్కరు కూడా సిద్ధమవుతున్నారు. అయితే t20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే అటు మరో వరల్డ్ కప్ ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తుంది. అదే అండర్ 19 వరల్డ్ కప్ కావడం గమనార్హం.


 ప్రపంచ క్రికెట్ కి భవిష్యత్తు తారలు అయిన కుర్రాళ్ళు అందరూ కూడా ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా హోరాహోరీగా తలబడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇక భారీ అంచనాల మధ్య అన్ని టీమ్స్ బరిలోకి దిగాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఎప్పటిలాగానే అటు భారత కుర్రాళ్ళు కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగారు. గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ టోర్నిలలో  భారత అండర్-19 జట్టు ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఈసారి కూడా డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ కప్పు కొట్టడం ఖాయమని ఎంతమంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.


 ఇలా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన అండర్ 19 టీమ్ ఇండియా జట్టు ఇక ఈ వరల్డ్ కప్ లో అందరూ ఊహించినట్లుగానే బోణి కొట్టింది. ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ ఇండియా ఏకంగా 84 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఈ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 251/7 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత లక్ష్య  చేదనకు దిగిన బంగ్లా జట్టును కట్టడి చేయడంలో భారత బౌలర్లు సక్సెస్ అయ్యారు. దీంతో బంగ్లా జట్టు 167 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో మొదటి అడుగులోనే అటు భారత జట్టు ఘనవిజయాన్ని సాధించి అదరగొట్టింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: