ప్రస్తుతం భారత క్రికెట్లో ఎక్కడ చూసినా ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే సొంత గడ్డపై జరుగుతున్న టెస్టు సీరిస్ లో అటు భారత్ జట్టు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి అటు ఇంగ్లాండ్ జట్టు సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో ఎటాకింగ్ గేమ్ మొదలుపెట్టింది. బజ్ బాల్ అనే విధానంతో ఏకంగా ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ఎటాకింగ్ గేమ్ లో విఫలమైనప్పటికీ ఇక బాల్ అనే విధానాన్ని మాత్రం అస్సలు వదులుకోవడం లేదు ఇంగ్లాండ్ జట్టు.


 ఈ క్రమంలోనే ఇలా ఇంగ్లాండ్ జట్టు ఎటాకింగ్ గేమ్ ను ఎదుర్కోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేసుకున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక ఇండియాలోని వివిధ వేదికలలో టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తే బాగుంటుంది అనే విషయంపై ఎంతోమంది భారత మాజీలు కూడా అటు సూచనలు సలహాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు అని చెప్పాలి. ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడం భారత జట్టుకు ఎంతో కీలకం. ఎందుకంటే టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో ఈ సిరీస్ గెలిస్తేనే భారత జట్టు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.


 కథ ఈనెల 25వ తేదీన తొలి టెస్ట్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ గురించి భారత మాజీ సునీల్ గావాస్కర్ స్పందించాడు. ఇటీవల స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో గవాస్కర్ మాట్లాడుతూ హైదరాబాద్ పిచ్ లో టర్న్ అంతగా ఉండదు. అందుకే బౌలర్లను రోహిత్ శర్మ తెలివిగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి లంచ్ వరకు మంచి ఆరంభం అందుకుంటే.. బౌలర్లను రోహిత్ ఎలా యూస్ చేసుకుంటాడో చూడాలి. ఇక ఓపెనర్ గా రోహిత్ రానిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ల పని ఎంత సులభం అవుతుంది అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. 2021లో చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో స్పిన్ కు సహకరించే పిచ్ పై సెంచరీ చేసి ఎలా ఆడాలో రోహిత్ చూపించాడో. ఇప్పుడు కూడా అలాంటి ఆరంభాలు ఇవ్వాలి అంటూ గవాస్కర్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: