
ఇలా విడాకుల విషయంలో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన షోయబ్ మాలిక్ ఇక చెత్త ప్రదర్శన ద్వారా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు ఈ పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్. అయితే ఇటీవల ఏకంగా మూడు నోబాల్స్ వేశాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు నోబాల్స్ వేయడం చూస్తూ ఉంటాం. ఏకంగా ఒక ఓవర్ లో ఒక నోబాల్ వేయడమే గొప్ప. అలాంటిది ఏకంగా స్పిన్నర్ అయినా షోయబ్ మాలిక్ మాత్రం ఏకంగా ఒకే ఓవర్లో మూడు నో బాల్స్ వేశాడు.
అయితే స్పిన్నర్లు నోబాల్ వేయడాన్ని అటు ఒక పెద్ద నేరంగా అభిమానిస్తూ ఉంటారు విశ్లేషకులు. ఇక ఇప్పుడు షోయబ్ మాలిక్ ఏకంగా ఒకే ఓవర్లో మూడు నో బాల్స్ వేయడంతో అతన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి. ఏకంగా అతని మూడు పెళ్లిళ్లకు గుర్తుగా అతను ఇలా మ్యాచ్ లో మూడు నోబాల్స్ వేసి ఉంటాడు అంటూ ఎంతో మంది సెటైర్లు కూడా వేస్తూ ఉండడం గమనార్హం. అయితే గతంలో అతను టి20 వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే ఇలాంటి ఆటతీరుతో ఇక టి20 వరల్డ్ కప్ ఆడితే పాకిస్తాన్ జట్టు పరిస్థితి అంతే అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.