
కాగా ఇక రేపటి నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా.. మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయం పైన ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తూ ఉన్నారు. ఇలాంటి రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ అనే ఎటాకింగ్ గేమ్ ఆడుతూ ప్రత్యర్థులపై పైచేయి సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.
అయితే ఇటీవల ఇదే విషయం గురించి ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ వారికి అలవాటైన రీతిలో దూకుడుగా ఆడితేనే తమకు మంచిది అంటూ బుమ్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. బ్యాట్స్మెన్ ఎంత దూకుడుగా ఆడితే అన్ని తప్పులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. క్రమం తప్పకుండా వికెట్లు పడేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది. వారు దూకుడుగా ఆడే కొద్ది నాకు కుప్పలుగా వికెట్లు లభిస్తాయి అని నేను అనుకుంటాను. అందుకే ఇంగ్లాండ్ ఎటాకింగ్ గేమ్ ఆడితేనే మాకు మంచిది అంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు.