
ఇక క్రీజు లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా వీరవిహారం చేయడమే లక్ష్యంగా ఇక బ్యాడ్ జులిపిస్తూ ఉన్నాడు. సిక్సర్లు పోర్లతో చెలరేగిపోతున్న యువ ఆటగాళ్లు సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హైదరాబాద్ జట్టు వరుస విజయాలు సాధిస్తూ దూసుకు వస్తుంది. అయితే ఇక ఇటీవల రంజీ ట్రోఫీలో అటు అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా బ్యాటింగ్లో వీర విహారం అంటే ఎలా ఉంటుందో చేసి చూపించారు.
ఒకరకంగా చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టించారు అని చెప్పాలి. ఏకంగా ఈ మ్యాచ్ లో 500 పరుగులు చేశారు. 500 పరుగులు అనగానే ఏ 100 ఓవర్లో ఆడి ఉంటారులే అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే 43.5 ఓవర్లలోనే ఏకంగా 500 పరుగులు చేశారు. మొత్తంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 48 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి.. 529 పరుగులు చేసింది. ఇక ఆ జట్టు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ ఏకంగా 323 పరుగులు చేసి త్రిబుల్ సెంచరీ తో అదరగొట్టాడు. రాహుల్ సింగ్ 185 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇలా హైదరాబాద్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో అటు అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు అని చెప్పాలి.