ఇటీవల కాలంలో ఇండియాలో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు ఎంతో మంది ప్రతిభగల యువ ఆటగాళ్లు తెరమీదకి వస్తూనే ఉన్నారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఒకప్పుడు కేవలం ఐపిఎల్ లో రాణిస్తే మాత్రమే ఆటగాళ్లకు ఛాన్సులు దక్కేవి అని మాట్లాడుకునేవారు. కానీ ఇటీవల కాలంలో దేశవాలి క్రికెట్లో యువ ఆటగాళ్లు రాణిస్తున్న తీరు చూస్తూ ఉంటే సెలక్టర్లు వారిని సెలెక్ట్ చేయకపోతే ఎక్కడ విమర్శలు వస్తున్నాయేమో అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది.


 ఇక వారి ఆట తీరు చూస్తూ ఉంటే టీమిండియా భవిష్యత్తు కి ఎలాంటి ఆటంకం ఉండదు అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అంతలా అదరగొట్టేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది. అయితే హైదరాబాద్ జట్టు ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో నిదానంగా ఆడాల్సిన టెస్ట్ క్రికెట్లో అటు దూకుడుగా ఆడుతూ హైదరాబాద్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా ప్రత్యర్థి పై ఒత్తిడి పెంచుతూ అదరగొట్టేస్తున్నారు అని చెప్పాలి. అయితే సాధారణంగా ఇలా ఒక మ్యాచ్ లో సెంచరీ చేస్తేనే.. ఆ ఆటగాడి పై ప్రశంసలు కురుస్తూ ఉంటాయి. అలాంటిది డబుల్ సెంచరీ చేస్తే ఇక అతన్ని మించినోడు లేడు అంటూ అందరూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు.


 అలాంటిది ఏకంగా త్రిబుల్ సెంచరీ తో చెలరేగి పోతే.. అతను క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్ క్రికెటర్ తన్మయ్ అగర్వాల్ సైతం ఇలాంటి బ్యాటింగ్ తీరుతూనే అదరగొట్టేస్తున్నాడు. ఏకంగా ఇటీవల సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్లో వీర విధ్వంసం అంటే ఏంటో చూపించాడు. కేవలం 160 బంతుల్లోనే 323 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉండడం గమనార్హం. ఇక తక్కువ బంతుల్లోనే త్రిశతకం బాదిన క్రికెటర్ గా నిలిచాడు తన్మయ్ అగర్వాల్. ఇంతకుముందు ఈ రికార్డ్ సౌతాఫ్రికాకు చెందిన మార్గం మైరస్ (190 బంతుల ) పేరిట ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: