అయితే 2024 ఐపీఎల్ టోర్ని మాత్రం ఏకంగా ఐదుగురు స్టార్ ప్లేయర్లు దూరం కాబోతున్నారు అన్నది తెలుస్తుంది. అదికూడా ఈ ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ లో ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్న ఆటగాళ్లే ఇక జట్టుకు దూరం అవుతున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గాయాల పాలైన సదరు టాప్ 5 ప్లేయర్స్ చివరికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ ఐదుగురు ఆటగాళ్లు దూరం అవడం మాత్రం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమ్స్ కి పెద్ద ఎదురు దెబ్బ లాంటిది. ఇంతకీ ఆ అయిదుగురు టాప్ ప్లేయర్స్ ఎవరో కాదు.. గత ఏడాది జరిగిన వరల్డ్కప్ లో అదరగొట్టిన మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ తో పాటు పృథ్వి షా రిషబ్ పంత్ లు కూడా ఉన్నారు అని చెప్పాలి.
అయితే ఈ అందరు ప్లేయర్లు గతంలో టీమిండియాకు ఆడిన వారే కావడం గమనార్హం. తమ ఆట తీరుతో ఎన్నోసార్లు భారత జట్టుకు విజయాన్ని అందించిన స్టార్ ప్లేయర్లు వీళ్ళు. ఇక ఐపీఎల్ టోర్నిలో ఈ స్టార్ ప్లేయర్లు ఎంత చాటుతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఈ ఐదుగురు ప్లేయర్లు 2024 ఐపీఎల్ టోర్నీకి దూరం కాబోతున్నారు అనేది తెలుస్తుంది. టి20 ర్యాంకింగ్స్ లో టాప్ లో నెంబర్ వన్ ప్లేయర్గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ఇప్పటికే టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ నాటికి అతను కోలుకోవడం అనుమానమే. ఇక మహమ్మద్ షమి ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో ఐపీఎల్ కు దూరం కానున్నాడు. హార్దిక్ పాండ్యా, పృథ్వి షా రిషబ్ పంతులు విషయంలో కూడా ఇదే జరగబోతుంది అనేది తెలుస్తోంది.