అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో కాస్త తడబడినట్లు కనిపించింది ఇంగ్లాండ్ జట్టు. అటు భారత బ్యాట్స్మెన్లు మాత్రం భారీగా పరుగులు చేశారు. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా పుంజుకుంది అని చెప్పాలి. క్రీజులో పాతుకు పోయి పరుగుల వరద పారిస్తూ ఉన్నారు ఆ జట్టు బ్యాట్స్మెన్లు. దీంతో కొన్ని చెత్త రికార్డులు అటు భారత బౌలర్లు ఖాతాలో చేరిపోతున్నాయి. మొదటి ఇన్నింగ్స్ లో పరుగులను కట్టడి చేయడమే కాదు వికెట్లు తీసి అరుదైన రికార్డు సృష్టించింది అశ్విన్ - జడేజా జోడి. దీంతో రెండో ఇన్నింగ్స్ లో కూడా అదరగొట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో రెండు ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు చెలరేగిపోయారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన అశ్విన్ - జడేజా జోడి ఎక్కడ ప్రభావం చూప లేకపోయింది.
భారీగా పరుగులను సమర్పించుకుంది అని చెప్పాలి. ఏకంగా అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో 126 పరుగులు సమర్పించుకోగా.. రవీంద్ర జడేజా 131 పరుగులు ఇచ్చాడు. అయితే ఇండియాలో సెకండ్ ఇన్నింగ్స్ లో ఇద్దరు బౌలర్లు 100కు పైగా పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే రెండు ఇన్నింగ్స్ లో కలిపి అటు అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. కాగా రసవత్తారంగా సాగుతున్న ఈ మ్యాచ్ లో గెలవాలి అంటే రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు బ్యాటింగ్లో అదరగొట్టాల్సి ఉంటుంది. లేదంటే మొదటి మ్యాచ్ లోనే చేదు అనుభవం తప్పదు.