
ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఆటతీరుతో ఇక మిగతా టెస్టుల్లో కూడా భారత జట్టు విజయం సాధించలేదు అంటూ ఎంతో మంది టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఇక మొదటి మ్యాచ్ లో ఓడిపోయి నిరాశపరిచిన టీమ్ ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం తప్పక విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలను రచిస్తుంది. కాగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం.
అయితే రెండో టెస్ట్ మ్యాచ్లో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక గత కొంతకాలం నుంచి జట్టులో యువ ఆటగాడు గిల్ వరుసగా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు. ఇక ఇదే విషయంపై ఇటీవల స్పందించిన భారత క్రికెట్ దిగజం అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత టెస్టు జట్టులో పూజారకు ఎప్పుడు దక్కని అవకాశాలు గిల్ కు దక్కుతున్నాయి అంటూ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. వంద టెస్టులకు పైగా ఆడిన పూజారకు దొరకని చాన్సులు గిల్ కు లభిస్తున్నాయి. కానీ వాటిని అతను సద్వినియోగం చేసుకోవాలి. మూడో స్థానంలో ఓపికగా ఆడాలి మైండ్ సెట్ టెక్నిక్లను మార్చుకోవాలి. సరైన మార్గదర్శనం కోసం అద్భుతమైన ఆటగాడు భారత కోచ్గా ఉన్నాడు అంటూ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు.