అందుకే జస్ ప్రీత్ బుమ్రా జట్టులో కీలక బౌలర్ గా మాత్రమే కాదు.. ఇక డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇటీవల బుమ్రా ఇక భారత జట్టుకు ఎంత కీలకమైన ఆటగాడు అన్న విషయాన్ని ఇటీవల మరోసారి నిరూపించాడు. ఇంగ్లాండుతో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఇంగ్లాండ్ తో ఇన్నింగ్స్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. బుల్లెట్ లాంటి బంతులను విసిరి ఆరు వికెట్లు తీశాడు. ఇక బుమ్రా ఇన్ స్వింగర్ బంతులకు అటు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. బుమ్రా బౌలింగ్ వేస్తుంటే అటు ఇంగ్లాండ్ కెప్టెన్గా కొనసాగుతున్న స్టోక్స్ సైతం ఆశ్చర్యంలో మునిగిపోయి వికెట్ సమర్పించుకున్నాడు.
అయితే ఈ అద్భుతమైన ప్రదర్శనతో బుమ్రా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు అని చెప్పాలి. అయితే ఇలా రికార్డులు సాధించడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు సాధించడం పై స్పందించాడు. తాను నెంబర్లు మైలురాళ్లను చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అలా చేయడం అదనపు ఒత్తిడిని పెంచుతుంది. తాను దేశం కోసం మంచి ప్రదర్శన చేయడం పైన దృష్టి పెడతాను అంటూ బుమ్రా చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల జరిగిన మ్యాచ్లో 15.5 ఓవర్లు వేసి.. కేవలం 45 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు.