
అప్పటివరకు మొదటి టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లతోపాటు రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన గిల్.. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం సెంచరీ తో చెలరేగిపోయాడు. ఏకంగా 104 పరుగులు చేశాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గిల్ సెంచరీ నేపథ్యంలో ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా తెరమిదికి వచ్చాయి. ఏకంగా ఒకేరోజు టెస్ట్ ఫార్మట్ లో నలుగురు ప్లేయర్లు సెంచరీ చేశారు. అదేంటి గిల్ ఒక్కడే కదా సెంచరీ చేసింది నలుగురు ప్లేయర్లు అంటారేంటి అనుకుంటున్నారు కదా.
అయితే కేవలం ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రమే కాదు ఇక వరల్డ్ క్రికెట్లో ఎన్నో టీమ్స్ టెస్టు సిరీస్ లో ఆడుతుండగా ఆయా టెస్ట్ మ్యాచ్లలో కూడా మొత్తంగా నలుగురు ప్లేయర్లు ఒకేరోజు సెంచరీ తో చలరేగిపోయారు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో 14 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా తో టెస్ట్ లో న్యూజిలాండ్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర 118, కేన్ విలియంసన్ 112 పరుగులు చేసి సెంచరీలతో చెలరేగారు. ఇక శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రన్ 101 సెంచరీ తో రాణించాడు. ఇలా ఈ నలుగురు బ్యాట్స్మెన్లు తమ మెరుపు బ్యాటింగ్ తో ప్రేక్షకులను అలరించారు.