
అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయి తీవ్ర విమర్శల పాలు అయినా టీమిండియా జట్టు.. ఇక తప్పకుండా గెలవాలనే కసితో రెండో మ్యాచ్ లో బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే యశస్వి జైష్వాల్ డబుల్ సెంచరీ, బుమ్రా బౌలింగ్ ప్రదర్శన, గిల్ సెంచరీ తో ఎంతో అలవోకగా ఇంగ్లాండ్ జట్టు పై విజయం సాధించింది. అది కూడా 100 పరుగులకు పైగా తేడాతో విజయం సాధించడం గమనార్హం. అయితే మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ చేతిలో మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయి ఏకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు పట్టికలో ఐదవ స్థానానికి టీమిండియా పడిపోయింది అన్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మరోసారి పైకి దూసుకు వచ్చింది టీమిండియా. ఏకంగా 5వ స్థానంలో నుండి రెండో స్థానానికి వచ్చేసింది. ప్రస్తుతం 52.77%తో రెండో స్థానంలో ఉంది. ఇక 55% ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ రెండు టీమ్స్ తర్వాత దక్షిణాఫ్రికా 50, న్యూజిలాండ్ 50, బంగ్లాదేశ్ 50 శాతం పాయింట్లతో తర్వాత మూడు స్థానాలలో ఉండగా.. ఇంగ్లాండ్ 25% తో ఎనిమిదవ స్థానంలోకి పడిపోయింది. కాగా ఈ సిరీస్ లోని మిగతా అన్ని మ్యాచ్లలో గెలవాలని టీమ్ ఇండియా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.