టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు మాజీ క్రికెటర్ లెజెండ్ ధోని వారసుడిగా కూడా రిషబ్ పంత్ పేరు సంపాదించుకున్నాడు. అయితే అతని కెరియర్ టీమ్ ఇండియాలో సాఫీగా సాగిపోతున్న సమయంలో అతని  లైఫ్ లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఏకంగా దారుణమైన యాక్సిడెంట్ బారిన పడ్డాడు పంత్. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవశాత్తు చివరికి ప్రాణాలతో బయటపడగలిగాడు అని చెప్పాలి.


 ఇక రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్ర గాయాల పాలైన రిషబ్ పంత్.. అప్పటి నుంచి క్రికెట్కు పూర్తిగా దూరమైపోయాడు. దీంతో రిషబ్ పంత్ అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అనే మాట తప్ప అతను మళ్ళీ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టింది లేదు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో వైద్యుల పర్యవేక్షణలో ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నాడు ఈ ఆటగాడు. అయితే అతను ఎప్పుడు మళ్ళీ టీమిండియాలోకి వస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కనీసం ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ లో అయినా అతను ఆడతాడా లేదా అనే విషయంపై ఇప్పటికి అనుమానాలు నెలకొన్నాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే రిషబ్ పంత్ 2024 ఐపీఎల్ సీజన్లో ఆడతాడా లేదా అనే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ నేను రిషబ్ పంత్ ని ఐపిఎల్ ఆడతావా అని అడిగితే అన్ని మ్యాచ్లు ఆడతా అని అంటాడు. అతడు వచ్చే ఐపిఎల్ సీజన్ మొత్తం ఆడాలన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అయితే ఈ సీజన్లో వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా.. అతడిని ఆడించాల వద్ద అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఒకరకంగా రిషబ్ పంత్ కోలుకున్నాడు అన్న విషయాన్ని ఇండైరెక్టుగా చెప్పేసాడు రికీ పాంటింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: