
ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాసుపత్రిలో అరకొర సదుపాయాలు ఉండడంతో.. ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. సాధారణం గా అత్యవసర చికిత్స కోసం ఉపయోగించే ఐసీయూ లో ఎంత అధునాతనమైన సౌకర్యాలు అందు బాటులో ఉంటాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. రోగులకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోపకుండా ఉండేందుకు బయట వ్యక్తులను ఎవరిని కూడా ఐసీయు లోకి అనుమతించరు. అలాంటిది ఇక్కడ ఐసియు చూస్తే మాత్రం ఏకంగా ఎలుకలకు నిలయంగా మారిపోయింది. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న రోగులందరికీ కూడా ఎలుకలు గాయాలు చేస్తూ ఉండడం మరింత సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి పరిస్థితి నెలకొంది.
కామారెడ్డికి చెందిన షేక్ ముజీబ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అయితే అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా రాత్రి సమయంలో రోగులందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత ఎలుకలు ఆసుపత్రిలో సంచరించాయ్. ఈ క్రమంలోనే ఎలుక ముజీబ్ ని కరవడంతో అతని కాళ్లు చేతులకు గాయాలు అయ్యాయి అని చెప్పాలి.అయితే ప్రాణాపాయంతో ఆసుపత్రికి వస్తే చివరికి ఇక్కడ ఉన్న ఎలుకలే రోగుల ప్రాణాలు తీసే లాగా ఉన్నాయి అని ఎంతోమంది రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అని ఆరోపిస్తున్నారు.