అయితే ఇలా క్రికెట్ తో మాత్రమే కాదు అటు పర్సనల్ విషయాలతో కూడా వార్తల్లో కాస్త హాట్ టాపిక్ గానే మారిపోతున్నాడు ఈ క్రికెటర్. ఏకంగా కొన్ని రోజుల క్రిందట ఫుల్లుగా మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రి పాలు అయ్యాడు మాక్స్వెల్. ఈ క్రమంలోనే అతనిపై విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి. కానీ ఇలాంటి పరిస్థితుల నుంచి కోలుకొని ఇటీవల సెంచరీ తో చెలరేగిపోయాడు ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్. ఇకపోతే గతంలో ఇలా తప్ప తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటనపై.. ఇటీవల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ ఆస్ట్రేలియా క్రికెటర్.
ఈ ఘటనతో నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతగానో బాధపడ్డారు. ఆ వారం ఆటకు దూరంగా ఉంటానని తెలుసు. సమయానికి జట్టుతో కలిసాను. ఇక ఇలా మద్యం సేవించడం విషయంలో మున్ముందు మరింత జాగ్రత్తగా ఉంటాను అంటూ మాక్స్ వెల్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయపడ్డారు. మద్దతుగా నిలిచారు అంటూ తెలిపాడు. అయితే ఇలా ఫుల్లుగా మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన మాక్స్ వెల్ ఫై విమర్శలు రాగా.. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ తో చెలరేగిపోవడంతో ఇక అందరూ అతనిపై ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు.