
40 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా యువ ఆటగాళ్లకు మించిన ప్రదర్శన చేస్తూ అదరగొట్టేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తమ ఆట తీరుతో ప్రేక్షకులందరినీ కూడా ఫిదా చేసేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి లిస్టులో చేరిపోయాడు ఇమ్రాన్ తాహీర్. సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ అయిన ఇతనికి ప్రస్తుతం 44 ఏళ్ళు. ఈ వయసులో అందరూ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి కోచ్ గా మారుతుంటే అతను మాత్రం ఇంకా క్రికెటర్ గానే అదరగొడుతూ ఉన్నాడు. తన స్పిన్ బౌలింగ్ తో ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ 44 ఏళ్ల సీనియర్ బౌలర్ చరిత్ర సృష్టించాడు.
టి20 ఫార్మాట్లో 500 వికెట్లు తీసిన నాల్గవ బౌలర్గా అరుదైన ఘనతను సాధించాడు ఇమ్రాన్ తాహిర్. అతనికంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెస్టిండీస్ క్రికెటర్లు బ్రావో, సునీల్ నరైన్ మాత్రమే 500 వికెట్లు పడగొట్టిన బౌలర్లుగా కొనసాగుతున్నారు అని చెప్పాలి. అయితే అందరూ క్రికెట్లో కొనసాగుతున్న సమయంలో ఈ ఘనత సాధిస్తే అటు ఇమ్రాన్ తాహిర్ మాత్రం రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 44 ఏళ్ల వయసులో ఈ అరుదైన ఘనతను సాధించడం గమనార్హం. కాగా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో పలు టి20 టోర్నీలలో ఆడుతూ ఉన్నాడు. అయితే ఐపీఎల్ లో గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున కూడా అతను ప్రాతినిధ్యం వహించాడు అని చెప్పాలి.