మరి కొంతమంది మాత్రం ఏకంగా భారీ సిక్సర్ కొట్టాలని ప్రయత్నించి చివరికి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇక ఇలా రెండు చేతులతో సిక్సర్లు కొట్టడమే కాస్త కష్టం అని చెబుతూ ఉంటారు ఆటగాళ్లు. కానీ ఇక్కడొక ఆటగాడు మాత్రం రెండు చేతులతో కాదు కేవలం ఒంటి చేత్తో అదిరిపోయే సిక్సర్ కొట్టాడు. అయితే ఇప్పుడు వరకు టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్, లియాన్ లివింగ్ స్టోన్ లాంటి ఆటగాళ్లు ఒంటి చేత్తో సిక్సర్లు కొట్టడం ఇప్పటివరకు చాలా సార్లు చూసాం. ఈ క్రమంలోనే సదరు స్టార్ ప్లేయర్స్ కొట్టిన సిక్సర్లు చూసి వారికి ఈ రేంజ్ లో పవర్ ఎలా వచ్చిందో అని ఆశ్చర్యపోతూ ఉంటారు ప్రేక్షకులు.
అయితే ఇక ఇప్పుడు ఇలాగే ఒంటి చేత్తో సిక్సర్ల సునామీ సృష్టించాడు ఒక ఆటగాడు. అయితే అతను కేవలం వంటి చేత్తోనే బ్యాటింగ్ చేయడం గమనార్హం. స్పెయిన్ కి చెందిన మహమ్మద్ బాబర్ ఇలా తన బ్యాటింగ్ తో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ బ్యాట్స్మెన్ కేవలం ఒంటి చేత్తో భారీ సిక్సర్ లను కొట్టడం ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన వీడియోలో చూడొచ్చు. ఏకంగా వరుసగా రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఇది చూసిన ఎంతోమంది క్రికెట్ లవర్స్ అతన్ని బాబర్ బాహుబలి అని పిలుస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల చెక్ రిపబ్లిక్ వర్సెస్ స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇక అతను ఒంటి చేత్తో సిక్సర్ల సునామీ సృష్టించాడు.