ఐపీఎల్ రూపంలో క్రికెట్ ప్రేక్షకులందరికీ ప్రతి ఏడాది ఏకంగా ఒక పండుగను తీసుకువస్తూ ఉంటుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే దాదాపు గత పదహారేళ్ల నుంచి కూడా ఈ ఐపీఎల్ సీజన్ ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ t20 లీగ్ గా కూడా గుర్తింపును సంపాదించుకుంది ఐపీఎల్. ఇక వరల్డ్ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్లందరూ కూడా ఈ టోర్నీలో భాగం కావాలని ఆశ పడుతుంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి అన్ని సన్నహాలు చేస్తుంది బిసిసిఐ.


 ఐపీఎల్ ప్రారంభానికి కేవలం నెలరోజుల సమయం మాత్రమే ఉండడంతో ఇక ఐపీఎల్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇక ఏడాదికోసారి జరిగే.. ఈ ఐపీఎల్ సీజన్ కోసం అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ప్రతి మ్యాచ్ ని కూడా మిస్ కాకుండా ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ కి సంబంధించిన హడావిడి నెలకొన్న నేపథ్యంలో ఇక ఐపీఎల్ హిస్టరీలో అద్భుతంగా రానించిన ఆటగాళ్ళు ఎవరు.. బెస్ట్ కెప్టెన్స్ ఎవరు అన్న విషయంపై కూడా ఎంతో మంది మాజీ ప్లేయర్లు తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు ఐపీఎల్ హిస్టరీలో ఎంతోమంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.



 ఈ క్రమంలోనే ఐపీఎల్ హిస్టరీలో ఇక సూపర్ సిక్స్ ప్లేయర్లు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇటీవల ఐపీఎల్ హిస్టరీలో అద్భుతమైన ప్రదర్శన కనపరిచిన సూపర్ 6 ప్లేయర్స్ ఎవరు అన్న విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ ఇటీవల ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, అత్యధిక పరుగుల వీరుడుగా ఉన్న విరాట్ కోహ్లీ, మిస్టర్ ఐపిఎల్ గా పేరు సంపాదించుకున్న సురేష్ రైనా, ఇక స్టార్ బౌలర్ బుమ్రా, మిస్టర్ 360 ప్లేయర్ ఎబి డివిలియర్స్, సూపర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలకు ఛాన్స్ ఇచ్చింది. ఈ ఆరుగురు ఆటగాళ్లను కూడా ఐపీఎల్ హిస్టరీలో సూపర్-6 ప్లేయర్లు అంటూ తెలిపింది స్టార్ స్పోర్ట్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl