స్మృతి మందాన.. ఈమె గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ఇండియన్ ఉమెన్ క్రికెట్ లో లెజెండ్ గా ఎదిగింది స్మృతి మందాన. అతి తక్కువ వయసులోనే ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టింది. అయితే సాధారణంగా క్రికెటర్లు తమ ఆట తీరుతో గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. కానీ స్మృతి మందాన మాత్రం కేవలం తన ఆట తీరుతో మాత్రమే కాదు తన అందం అభినయంతోను మంచి గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా తన చిరునవ్వుతో కోట్లాదిమంది కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది.



 అయితే భారత జట్టులో మూడు ఫార్మట్లలో కూడా కీలక ప్లేయర్గా కొనసాగుతున్న స్మృతి మందాన. ఇక తన బ్యాటింగ్ తో అదరగొడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన స్మృతి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది స్మృతి మందాన. ఇకపోతే ఇక ఇప్పటికే మహిళా క్రికెట్లో లెజెండ్ గా ఎదిగిన ఈమె ఇక తన క్రికెట్ కెరియర్ లో స్ఫూర్తినిచ్చిన క్రికెటర్లు ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది.



 తనకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగకర ఫేవరెట్ క్రికెటర్లు అంటూ తెలిపింది టీమిండియా ఉమెన్ క్రికెటర్ స్మృతి మందాన. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. నేను ప్రత్యక్ష ప్రసారం చూసిన మ్యాచ్లలో 2016 t20 వరల్డ్ కప్ లో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ నా కెరియర్ లోనే బెస్ట్. విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీలో భాగస్వామ్యం అద్భుతం. ఇక వికెట్ల మధ్య వారు పరుగులు పెట్టిన తీరు బాగా నచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగకర ఫేవరెట్ క్రికెటర్లు అంటూ తెలిపింది స్మృతి మందన.

మరింత సమాచారం తెలుసుకోండి: