ఈ క్రమంలోనే ఇలా వీడ్కోలు పలికిన ఆటగాళ్ళు కొంతమంది వ్యాఖ్యాతలుగా మారిపోయి.. తమ గాత్రంతో క్రికెట్ మ్యాచ్లను ఉత్కంఠ భరితంగా మారుస్తూ ఉంటారు ఇంకొన్నిసార్లు ఏకంగా వివిధ జట్లకు కోచ్ లుగా మారిపోయి తమకు ఉన్న అనుభవంతో యువ ఆటగాళ్లను ఉన్నత క్రికెటర్లుగా తీర్చిదిద్దడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడు మళ్ళీ మైదానంలోకి బలిలోకి దిగాడు. దీంతో అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఇటీవలే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇది జరిగింది.
న్యూజిలాండ్ ఫేస్ బౌలర్ అయిన నీల్ వాగ్నర్ ఇటీవల క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దీంతో అతను క్రికెట్లో చేసిన సేవలను గుర్తి చేసుకుంటూ అందరూ ప్రశంసలు కురిపించారు. అయితే ఇటీవలే అతను మళ్లీ మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్లో అతడు సబ్ స్ట్యూట్ గా ఫీల్డింగ్ కి వచ్చాడు. ఈ సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులు కూడా ఘన స్వాగతం పలికారు అని చెప్పాలి. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా అతడు జట్టుతోనే ఉన్నాడు. నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు అని చెప్పాలి.