ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాన్స్ దక్కించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా భారత జట్టులో అప్పుడప్పుడు ఎంట్రీ ఇచ్చిన యువ ఆటగాళ్లు ఐపీఎల్లో ఛాన్స్ దక్కించుకొని.. ఇక తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అంతే కాకుండా ఇక ఐపీఎల్లో వచ్చిన డబ్బుతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్లో ఛాన్స్ రావాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి.


 ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే ఇలా అదృష్టం కలిసి వచ్చి ఏకంగా ఐపీఎల్ వేలంలో భారీ ధర పలుకుతూ ఉంటారు అని చెప్పాలి. కొంతమంది మాత్రం భారీ ఆశలతో వేలంలోకి వచ్చినప్పటికీ ఇక ఏ జట్టు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో.. అన్ సోల్డ్ గానే మిగిలిపోతూ ఉంటారు. అయితే ఇక 2024 ఐపీఎల్ మినీ వేలంలో ఇలా అన్ సోల్డ్ గా మిగిలిపోయిన ఆటగాళ్ళలో సర్పరాజ్ ఖాన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ వేలం తర్వాత అటు ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అతను జట్టులోకి వచ్చాడు. ఇక తన సత్తా ఏంటో చూపించాడు.


 ఇలా టీమిండియా తరఫున అద్భుతమైన ప్రదర్శన చేసిన ఈ యువ సంచలనానికి.. ఇక ఇప్పుడు ఒక లక్కీ ఛాన్స్ దక్కింది అన్నది తెలుస్తుంది. ఏకంగా మినీ వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన సర్పరాజ్ ఇక ఇప్పుడు గుజరాత్ తరపున ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుంది. ఎందుకంటే గుజరాత్ జట్టు 3.6 కోట్లు పెట్టి జట్టులోకి కొనుగోలు చేసిన రాబిన్ మింజ్ ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. దీంతో ఐపీఎల్ టోర్ని మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో సర్పరాజ్ ఖాన్ ను జట్టులోకి తీసుకోవాలని అటు గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl