అయితే ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా ఎన్నో రోజుల సమయం లేని నేపథ్యంలో ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి అందరూ చర్చించుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఈసారి ఐపీఎల్ లో ఎవరు ఎలాంటి ప్రదర్శన చేస్తారు అనే విషయంపై కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. పలువురు ఆటగాళ్లు గాయం బారిన పడి మొన్నటి వరకు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన వారు.. ఇక ఇప్పుడు ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గాయం బారిన పడి గత కొంత కాలం నుంచి క్రికెట్కు దూరమైన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇక జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి కెప్టెన్గా మళ్ళీ టీమ్ ని ముందుకు నడిపించబోతున్నాడు.
ఇటీవల ఇంగ్లాండుతో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు కేఎల్ రాహుల్. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో కోలుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా.. కీలకమైన బాధ్యతలను వదులుకునేందుకు రాహుల్ రెడీ అవుతున్నాడట. ఐపీఎల్ లో ప్రారంభంలోని కొన్ని మ్యాచ్లకు కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నాడట కేఎల్ రాహుల్. కేవలం బ్యాటర్ గా మాత్రమే కొనసాగబోతున్నాడట. వైద్యులు సూచన మేరకే కేఎల్ రాహుల్ ఇక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది తెలుస్తుంది.