కొన్ని రోజుల క్రితమే ఇండియాలో ఐ పీ ఎల్ "ఇండియన్ ప్రీమియర్ లీగ్" మ్యాచ్ లు ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా ప్రస్తుతం ఈ మ్యాచ్ లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠను రేపుతో ఉండడం తో ప్రేక్షకులు కూడా మ్యాచ్ లను అత్యంత ఇంట్రెస్ట్ తో చూస్తూ వస్తున్నారు . అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే సన్ రైజేస్ వర్సెస్ ముంబై కి మధ్య మ్యాచ్ జరిగింది.

దీనిలో ఇంత వరకు "ఐ పీ ఎల్" చరిత్రలో ఎవరూ కొట్టలేనం త స్కోర్ ను సన్ రైజర్స్ టీమ్ కొట్టింది. దానితో ఒక్క సారిగా ఈ సీజన్ లో సన్ రైజర్స్ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది . ఇకపోతే ఈ రోజు అనగా మార్చి 29 వ తేదీన బెంగళూరు వర్సెస్ కోల్కతా మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే పాత సమీకరణాల ప్రకారం ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని పరిశీలిద్దాం.

బెంగళూరు వర్సెస్ కోల్కతాకు కొంత కాలం క్రితం జరిగిన మ్యాచ్ లో బెంగళూరు టీం 49 పరుగులు చేసింది. ఇది బెంగళూరు కు కోల్కతా టీం పై ఒక చెత్త రికార్డు. ఇకపోతే 2015 తర్వాత సొంత మైదానం లో ఇప్పటి వరకు కోల్కతా పై బెంగళూరు టైమ్ గెలవలేదు. అలాగే మరికొన్ని సమయ కారణాల ప్రకారం చూసినట్లు అయితే ఈ రోజు బెంగళూరు పై కోల్కతా పై స్థానాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బెంగళూరు ఈ రోజు ఆ పాత సమీకరణాలన్నీటిని మార్చేసి కోల్కత్తా ఓడిస్తుందేమో తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl