అయితే ఈ ఏడాది కూడా ఇలా ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న యువ ఆటగాళ్ళు తమ ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే వరల్డ్ క్రికెట్ ఏలబోయే ఫ్యూచర్ స్టార్ మేమె అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్ కూడా అదరగొట్టేస్తూ అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఐపిఎల్ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లలో లక్నో టీం కి ప్రాతినిధ్యం వహిస్తున్న మయాంక్ యాదవు కూడా ఒకరు. కేవలం కొంతమంది పేస్ బౌలర్లకు మాత్రమే సాధ్యమైనా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే లక్నో యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా మూడుసార్లు 155 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి రికార్డులు సృష్టించాడు మయాంక్ యాదవ్. అతను ఇప్పుడు వరకు రెండు మ్యాచ్లు ఆడగా 50 కంటే ఎక్కువ బంతులే ఇలా 155 కిలోమీటర్లకు పైగా వేగంతో వేసి ఈ ఫీట్ సాధించాడు. కాగా ఉమ్రాన్ మాలిక్, నోర్జె రెండు సార్లు ఈ రికార్డు అందుకున్నారు. అయితే ఐపీఎల్ హిస్టరీలో షాన్ టైట్ వేసిన 150 పాయింట్ ఏడు కిలోమీటర్ల బేగంతో వేసిన బంతి ఇక అత్యంత ఫాస్టెస్ట్ బాల్ గా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఎవరు బద్దలు కొట్టలేదు.