
ఇక ప్రతిరోజు ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచు ప్రేక్షకులు అందరిని కూడా టీవీలకు అతుక్కుపోయేలా చేస్తూ ఉన్నాయి. కొంతమంది ప్రేక్షకులు టీవీల ముందు కూర్చుని మ్యాచ్ వీక్షిస్తూ ఉంటే ఇంకొంతమంది ప్రేక్షకులు స్టేడియం కు వెళ్లి మ్యాచ్ వీక్షించడానికి ఇష్టపడుతున్నారు. అయితే దేశంలోని 10 వేదికలపై కూడా ఇలా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో.. తమకు దగ్గరగా ఉన్న స్టేడియంలో మ్యాచ్ జరిగితే చాలు ఇక మిస్ చేయకుండా ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటానికి వెళ్ళిపోతున్నారు ప్రేక్షకులు. అయితే నేడు మరో ఉత్కంఠమైన సమరం జరగబోతుంది.
రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగబోతుంది. అయితే రాజస్థాన్ టీం కి హోమ్ గ్రౌండ్ గా పిలుచుకునే జైపూర్లో ఈ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు ఐదుసార్లు మ్యాచ్లు జరగగా నాలుగు సార్లు గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అయితే ఈసారి రాజస్థాన్ రాయల్స్ ఫుల్ ఫామ్ లో ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడితే అన్నింటిలో కూడా విజయం సాధించి.. ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతుంది. మరోవైపు గుజరాత్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి.. ఇక పాయింట్లు పట్టికలో ఏడవ స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం.