2024 ఐపిఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది అన్న విషయం తెలిసిందే. కొత్త కెప్టెన్ తో బలిలోకి దిగిన ఈ టీం ఇక వరుసగా విజయాలు సాధిస్తుంది. ప్రస్తుతం ఆరు మ్యాచ్ లలో నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జోరు చూస్తూ ఉంటే ఈసారి కూడా వరుసగా రెండోసారి టైటిల్ గెలిచేలాగే కనిపిస్తుంది.


 అయితే డిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మొదటి నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ ఇక టీం కి దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే గత ఏడాది చెన్నై జట్టు తరఫున అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఇక జట్టు టైటిల్ కలవడంలో కీలక పాత్ర వహించిన డేవాన్ కాన్వే ఈసారి కూడా అదరగొడతాడు అని అందరూ అనుకుంటుంటే.. ఇక అతను ఐపీఎల్ కి ముందే గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. కనీసం ఇక కొన్ని మ్యాచ్లు ఆడిన తర్వాత అయిన అతను అందుబాటులోకి వస్తాడేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.



 కానీ దేవాన్ కాన్వే టీం లోకి రావడం విషయంలో అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ కాన్వే ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడట. ఎడమచేతి బొటన వేలికి గాయంతో కాన్వే ఈ సీజన్లో ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. అతని స్థానంలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ గ్లెషన్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవల ప్రకటన చేసింది. ఈ రైట్ ఆర్మ్ ఫేసర్ ఇంగ్లాండ్ తరఫున ఆరు టి20 మ్యాచ్ లు ఆడి 9 టికెట్లు పడగొట్టాడు. అయితే దేవాన్ కాన్వే పూర్తిగా టోర్నీ మొత్తానికి దూరమైన నేపథ్యంలో ఇక చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఇక ఈ సీజన్ కి పూర్తిస్థాయి ఓపెనింగ్ జోడిని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl