
అయితే ఈసారి మాత్రం ఎలాంటి తప్పిదాలు చేయకుండా టి20 వరల్డ్ కప్ లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది అని చెప్పాలి. అయితే ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లకు టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక మరికొన్ని రోజుల్లో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించాలి అంటూ ఐసిసి డెడ్ లైన్ విధించింది. దీంతో బిసిసిఐ కూడా జట్టును ప్రకటించే ఛాన్స్ ఉంది.
అయితే బీసీసీఐ వరల్డ్ కప్ కు సంబంధించిన జట్టు వివరాలను ప్రకటించక ముందే కొంతమంది భారత మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయం ప్రకారం ఇక వరల్డ్ కప్ లో ఎవరు చోటు సంపాదించుకుంటారు అనే విషయంపై ఇక ఒక జట్టును ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు మాజీలు ప్రకటించగా ఇక హర్భజన్ సింగ్ సైతం తన టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇటీవల ఎంపిక చేసాడు. జట్టులో గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్ లకు చోటు ఇవ్వలేదు. ఇక కెప్టెన్గా రోహిత్ శర్మ, యశస్వి జైష్వాల్, కోహ్లీ, సూర్య, రిషబ్ పంత్, రింకు సింగ్, సంజు, శివం దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, బూమ్రా, మయాంక్ యాదవ్ ఆవేశ్ ఖాన్ లకు తన టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించాడు హర్భజన్ సింగ్. అయితే హార్దిక్ పాండ్యా ఫ్యూచర్ కెప్టెన్ అనుకుంటూ ఉండగా అతన్ని పక్కన పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.