ఎందుకంటే మునుపెన్నడు లేనివిధంగా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు కేవలం బౌలింగ్ విభాగంలో మాత్రమే మంచి ప్రదర్శన చేసిన సన్రైజర్స్ ఇక ఇప్పుడు బ్యాటింగ్లో కూడా ఊచ కోత అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తుంది. ఇక ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్ చేస్తుంది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోరును రెండుసార్లు బద్దలు కొట్టింది. ఒక రకంగా చూస్తుంటే సన్రైజర్స్ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఈసారి టైటిల్ విజేతగా నిలిచేలాగే కనిపిస్తుంది అని చెప్పాలి.
అయితే ఇలా సన్రైజర్స్ జట్టులోని ఆటగాళ్లు అందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంటే.. ఒక ప్లేయర్ మాత్రం ఆ జట్టుకు మైనస్ గా మారిపోతున్నాడు. అతను ఎవరో కాదు సన్రైజర్స్ మాజీ కెప్టెన్ మార్కరమ్. వరుసగా మ్యాచ్ లలో అతను విఫలం అవుతూనే ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన మర్కరమ్. 167 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా గొప్పగా ఏం లేదు. దీంతో మార్కరమ్ స్థానంలో న్యూజిలాండ్ హిట్టర్ ఫిలిప్స్ ను తుది జట్టులోకి తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.