జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈసారి యూఎస్ వెస్టిండీస్ వేదికలుగా ఈ ప్రపంచకప్ టోర్నీ జరగబోతూ ఉండగా.. మొత్తంగా 20 టీమ్స్ ఈ ఐసిసి టోర్నీలో పాల్గొనబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక టైటిల్ గెలవడమే లక్ష్యంగా అన్ని టీమ్స్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్. అయితే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ లో పాల్గొనబోయే జట్ల పూర్తిస్థాయి వివరాలను ప్రకటించాలి అంటూ ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆదేశాలను జారీ చేసింది.



 అయితే గత కొంతకాలం నుంచి అటు వరల్డ్ కప్ టోర్నిలలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వస్తున్న టీమిండియా టైటిల్ కలను మాత్రం సహకారం చేసుకోలేక పోతుంది. అయితే ఈసారి మాత్రం గత తప్పిదాలను రిపీట్ చేయకుండా అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగడానికి సిద్ధమవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక జట్టు ఎంపిక విషయంలో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లకు టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇలా బీసీసీఐ ప్రపంచ కప్ కోసం జట్టు ప్రకటన చేయకముందే.. తమ అభిప్రాయం ప్రకారం టి20 వరల్డ్ కప్ టీంలో ఎవరు చోటు దక్కించుకుంటారు అనే విషయంపై పలువురు మాజీలు టీం వివరాలను ప్రకటిస్తున్నారు.



 అయితే గతంలో భారత జట్టుకు చీఫ్ సెలెక్టర్ గా వ్యవహరించిన ఎమ్మెస్ కే ప్రసాద్ సైతం.. ఇటీవల తన టీ20 వరల్డ్ కప్ టీం ను ప్రకటించాడు. కెప్టెన్ గా రోహిత్, యశస్వి జైష్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, బుమ్రా, చాహల్, శివం దూపే, రింకు సింగ్, రిషబ్ పంత్, మయాంక్ యాదవ్ లను టి20 టి20 వరల్డ్ కప్ జట్టు కోసం ఎంపిక చేశాడు ఎంఎస్కే ప్రసాద్. అయితే అద్భుతమైన పాము కనబరుస్తున్న సంజూను మాత్రం పట్టించుకోలేదు. దీంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి. గతంలో అంబటి రాయుడు విషయంలో ఇదే చేశావు. ఇలా ఎంతమంది టాలెంటెడ్ ప్లేయర్లను తొక్కేయాలని చూస్తావు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Msk