కానీ పరీక్షల్లో మార్కులు వచ్చినట్లు.. లేదంటే లాటరీలో డబ్బులు తగిలినట్టు ఏకంగా మూడు మ్యాచ్లలో కూడా ఒకే రకమైన స్కోర్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా.. అదేంటి అదేలా కుదురుతుంది. మూడు మ్యాచ్లలో ఒకే రకమైన పరుగులు ఎలా చేస్తారు అని అంటారు క్రికెట్ గురించి తెలిసిన ప్రేక్షకులు ఎవరైనా సరే కానీ ఇక్కడ మాత్రం ఇదే జరిగింది. ఇటీవలే పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 3 t20 మ్యాచ్లలో కూడా ఒకే రకమైన స్కోర్ నమోదయింది అని చెప్పాలి. ఇక ఇది కాస్త వరల్డ్ క్రికెట్లో ఒక అరుదైన రికార్డుగా మారిపోయింది.
వరుసగా మూడు మ్యాచ్లలో కూడా ఏకంగా ఒకే రకమైన స్కోర్ నమోదు చేశాయి ఇరు జట్లు. రెండు జట్లు కలిపి 178 పరుగులు చేశాయి. ఐదు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 178/4 స్కోర్ చేసింది. నాలుగో టీ20 లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 178/7 స్కోర్ చేసింది. ఐదవ టి20 మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 178/5 పరుగులు చేయడం గమనార్హం. ఇలా వరుసగా మూడు మ్యాచ్లలో 178 పరుగులు చేశాయి ఇరుజట్లు. అయితే గెలుపు ఓటమిల విషయం పక్కన పెడితే ఇలా మొదట బ్యాటింగ్ చేసిన రెండు జట్లు కూడా 178 పరుగులు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ సిరీస్లో 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది న్యూజిలాండ్.