జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం ఇక భారత జట్టులోకి ఎవరు ఎంపిక కాబోతున్నారు.. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో ఎక్కడ చూసిన కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గతకొంతకాలం నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలవడంలో టీమిండియా వెనకబడిపోతుంది అన్న విషయం తెలిసిందే. అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ కీలకమైన మ్యాచ్ లలో మాత్రం ఓడిపోతూ నిరాశ పరుస్తూ ఉంది.


 ఈ క్రమంలోనే జూన్ నెలలో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ టోర్నిలో ఎలాంటి తప్పిదాలు చేయకుండా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని బీసీసీఐ అనుకుంటుంది. ఈ క్రమంలోనే అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఐపీఎల్లో బాగా రాణించిన ఆటగాళ్లకు టి20 వరల్డ్ కప్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అని అందరూ మాజీ ఆటగాళ్లు అంచనా వేస్తున్నారు. అయితే వరల్డ్ కప్ జట్టును ప్రకటించేందుకు ఇప్పటికే ఐసీసీ డెడ్ లైన్  కూడా విధించింది అన్న విషయం తెలిసిందే. దీంతో మరికొన్ని రోజుల్లో బీసీసీఐ వరల్డ్ కప్ జట్టును అఫీషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది.



 ఈ క్రమంలోనే టి20 ప్రపంచ కప్ జట్టు  లో ఎవరికి చోటుదక్క పోతుంది అన్నది ఆసక్తిగా మారిపోయింది. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇప్పటికే స్పందించగా.. ఇక పలువురు టీం ఇండియా ప్లేయర్స్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఒక ఓపెనర్ గా కెప్టెన్ రోహిత్ రావడం ఖాయం. ఇక అతనికి జోడిగా ఎవరిని ఎంపిక చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుత ఐపీఎల్ లో రాణిస్తున్న యశస్వి జైష్వాల్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మరో ఓపనర్ గిల్ స్పందించాడు. గత ఏడాది ఐపీఎల్లో 900 పరుగులు చేశాను. వన్డే వరల్డ్ కప్ ఆడాను. టీ20 వరల్డ్ కప్ లోను ఆడితే మరో కల తీరినట్లే. జట్టులో ఉంటాను అన్న నమ్మకం ఉంది. ఎంపిక అవ్వకపోతే బాధపడతా. కానీ ఏదేమైనా జట్టుకు అండగానే ఉంటా అంటూ గిల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gi