గత కొంతకాలం నుంచి ఐసీసీ టోర్నీలలో టైటిల్ గెలవడంలో వెనకబడిపోతున్న టీం ఇండియా.. ఇక జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో మాత్రం తప్పక విజయం సాధించి సత్తా చాటాలని అనుకుంటుంది. ఇక ఎన్నో ఏళ్ల నుంచి అందని ద్రాక్షలా ఉన్న కలను నెరవేర్చుకోవాలని అనుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. అయితే t20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టులో ఎవరికి చోటు దక్కుతున్న అనే విషయంపై ఉత్కంఠ నేలకొంది. ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లకు సెలెక్టర్లు మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ఇక అందరూ అంచనా వేశారు.


 అనుకున్నట్లుగానే ఐపీఎల్లో బాగా రాణిస్తున్న ప్లేయర్లకు ఇక వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. అదే సమయంలో ఐపీఎల్లో పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న ప్లేయర్లను కూడా కొంతమందిని సెలెక్టర్లు జట్టులోకి ఎంపిక చేశారు అని చెప్పాలి. కానీ ఇక భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ను మాత్రం.. జట్టు ఎంపికలో పరిగణంలోకి తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కనీసం రిజర్వ్ ప్లేయర్ల లిస్టులో కూడా రాహుల్ పేరు కనిపించలేదు. అదేంటి రాహుల్ లాంటి కీలక ప్లేయర్ని పక్కన పెట్టడం ఏంటి అని అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.


 అయితే ఇలా వరల్డ్ కప్ జట్టుకు కేఎల్ రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్ ను ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. రాహుల్ ఐపీఎల్ లో ఓపెనింగ్ చేస్తున్నాడు. కానీ మాకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. కావాలి అందుకు పంత్ శాంసన్ సరైన ఎంపిక అని మేము భావించాం. సంజు శాంసన్ ఏ ప్లేస్ లో అయినా సరే రాణించగలడు. అందుకే జట్టుకు ఎవరు అవసరం అనేదే చూశాము. కానీ ఎవరు బెటర్ అన్న విషయాన్ని చూడలేదు అంటూ అజిత్ అగర్కర్ చెప్పుకొచ్చాడు. అయితే కే ఎల్ రాహుల్ కు వరల్డ్ కప్ లో చోటు దక్కకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: