టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆటతీరుతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ధోని. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాదిమంది క్రికెట్ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక వరల్డ్ క్రికెట్లో బెస్ట్ వికెట్ కీపర్ గా బెస్ట్ ఫినిషర్ గా బెస్ట్ కెప్టెన్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతేకాదు టీమ్ ఇండియాకు కెప్టెన్ గా ఉంటూ అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను రెండు సార్లు అందించాడు.  అందుకే భారత క్రికెట్ చరిత్రలో ధోనీ పేరిట కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించబడి ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గత సీజన్ వరకు చెన్నై జట్టు కెప్టెన్ గా సేవలందించిన ధోని ఈ సీజన్లో మాత్రం కెప్టెన్సీ నుంచి తట్టుకొని రుతురాజ్ గైక్వాడ్ చేతిలో సారధ్య బాధ్యతలు పెట్టాడు. అయితే మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ధోని ఎప్పుడూ యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ముందుంటాడు. ఒకప్పుడు భారత జట్టులో ఉన్నప్పుడు ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నప్పుడు కూడా ఇలాగే ఎంతో మంది యువ ఆటగాళ్ళకు మద్దతుగా నిలిచాడు అని చెప్పాలీ.


 ఇలా ధోని మద్దతుతో సూచనలతో తమ ఆటను మెరుగుపరుచుకున్న ఆటగాళ్ళలో అటు పతిరణ కూడా ఒకరు అని చెప్పాలీ. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు పతిరన. అయితే ఇక చెన్నై మాజీ కెప్టెన్ ధోనిపై పతిరణ ప్రశంసలు కురిపించాడు. తన కెరీర్ ను ముందుకు తీసుకు వెళుతున్న అతనికి ధన్యవాదాలు తెలిపాడు. నాకు క్రికెట్ జీవితంలో ధోని తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ఇంట్లో నా ఫాదర్ ఎలాంటి సలహాలు ఇస్తారో.. మిస్టర్ కూల్ కూడా అలాగే మంచి సూచనలు ఇస్తున్నారు. నాపై ఎంతో శ్రద్ధ వహిస్తారు  ఆటగాళ్లను ఎలా చూసుకోవాలో ధోని కి బాగా తెలుసు అంటూ ప్రశంసలు కురిపించాడు పతిరణ.

మరింత సమాచారం తెలుసుకోండి: