ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం.. అంతేకాదు ఐదు సార్లు ఛాంపియన్. ఇక ప్రత్యర్థులకు వణుకు పుట్టించే ఆటగాళ్లు ఉన్న జట్టు. అయితే ఇన్ని ఉన్న అటు 2024 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకి అస్సలు కలిసి రావడం లేదు. జట్టులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వరుస ఓటములు తప్పడం లేదు. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతూ చివరికి ఓటమితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


 ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం నాలుగు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. ఇక పాయింట్ల పట్టికలో చివరన కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పగించినప్పటికీ కూడా ఎక్కడా ఆ జట్టుకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు అని చెప్పాలి. దీంతో టైటిల్ గెలవడం కాదు కనీసం ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అయితే ఇటీవల సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం విజయం సాధించింది ముంబై ఇండియన్స్.


 ఒకానొక సమయంలో కాస్త తడబాటుకు గురైనప్పటికీ ఆ తర్వాత పుంజుకొని రాణించడంతో  విజయం సాధించింది. అయితే ఇక ఈ సీజన్ లో కూడా ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వైఫల్యం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సన్రైజర్స్ తో మ్యాచ్లో గెలిచిన ముంబై ఖాతాలో ఒక చెత్త రికార్డు చేరింది. పవర్ ప్లే లో అత్యధిక వికెట్లు కోల్పోయిన జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పటివరకు పవర్ ప్లేలో 25 వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్. తర్వాత స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ 21, పంజాబ్ కింగ్స్ 18, లక్నో 18, సన్రైజర్స్ 17 ఉన్నాయి.  ఇటీవల జరిగిన మ్యాచ్ లో 4.1 ఓవర్లలోనే ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది ముంబై ఇండియన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl