ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ని అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు తమ ముందు ఉంచిన టార్గెట్ ను సన్రైజర్స్ ఎంతో అలవోకగా ఛేదించింది. లక్నో బ్యాట్స్మెన్లు 20 ఓవర్లు కష్టపడి చేసిన స్కోర్ ను కేవలం 9 ఓవర్లలోనే బద్దలు కొట్టేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. దీంతో ఇక సన్రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం ముందు అటు లక్నో కెప్టెన్ కే ఎల్ రాహుల్ ఏం చేయాలో తెలియక తల పట్టుకున్న పరిస్థితి వచ్చింది అని చెప్పాలి.


 అయితే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన కేఎల్ రాహుల్ సైతం ఇక టి20 ఫార్మాట్ తరహాలో కాదు వన్ డే ఫార్మాట్ తరహాలో బ్యాటింగ్ చేసి ఇక తక్కువ పరుగులకు వికెట్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే కేల్ రాహుల్ తీరుపై అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మ్యాచ్ ఓడిపోయినందుకు అతనిపై విమర్శలు కూడా వచ్చేవి  కానీ మ్యాచ్ పూర్తయిన తర్వాత లక్నో ఓనర్ గోయంక  ఏకంగా ఆ జట్టు కెప్టెన్ కే ఎల్ రాహుల్ పట్ల వ్యవహరించిన తీరు మాత్రం సంచలనంగా మారిపోయింది. ఏకంగా డగ్ అవుట్ లోనే రాహుల్ కి క్లాస్ పీకాడు. అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.


 ఏకంగా జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఆటగాడి పట్ల హర్ష గోయంగా ఇలా ప్రవర్తించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఇదే విషయంపై అటు టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ఒక జట్టు ఓనర్. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు. ఇలాంటి వాటిని మైదానంలో అందరి ముందు కాకుండా అంతర్గత సమావేశంలో లేదంటే డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడి ఉంటే బాగుండేది. కేఎల్ రాహుల్ మీ జట్టుకు కెప్టెన్. ఇది నిజంగా అవమానకరం అంటూ మహమ్మద్ షమీ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: