2024 ఐపీఎల్ సీజన్ లో అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంత దారుణంగా విఫలమయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈసారి తప్పకుండా టైటిల్ గెలుస్తుంది అనే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన బెంగళూరు టీం ఎప్పటిలాగానే అభిమానులను నిరాశపరిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు కేవలం ఐదు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. దీంతో కనీసం ప్లే ఆఫ్ లో అయినా అడుగుపెడుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్ అని చెప్పాలి.


 అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుపు ఓటమిలు ఎలా ఉన్నప్పటికీ అటు విరాట్ కోహ్లీ మాత్రం ఎప్పటిలాగానే తన ఆట తీరుతో జట్టును ఆదుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ జట్టును విజయతీరాలకు  నడిపించడానికి కష్టపడుతున్నాడు. కానీ అతనికి మిగతా ఆటగాళ్ళ నుంచి సరైన సహకారం అందకపోవడంతో చివరికి ఇక ఆర్సిబికి ఓటములు తప్పడం లేదు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ ఐపీఎల్ టోర్నీలో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.



 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. పంజాబ్ తో మ్యాచ్లో చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ.. టి20 క్రికెట్ లో 400 సిక్సర్ల మార్కులు అందుకున్నాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 6 సిక్సర్లు బాదిన కోహ్లీ మొత్తంగా పొట్టి ఫార్మాట్ లో 400 ఒక సిక్సర్లు కొట్టాడు. దీంతో అరుదైన రికార్డు అతని ఖాతాలో చేరింది. ఇక అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్ గా రోహిత్ శర్మ 506 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: