ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఒకవేళ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సక్సెస్ అయిన బాగుండేదేమో కానీ అతను ఘోరంగా విఫలం కావడంతో ఈ విమర్శలు డబుల్ అయ్యాయి ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో 12 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం నాలుగు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది.
దీంతో టైటిల్ గెలవడం కాదు.. కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టకుండానే ఇక ముంబై ఇండియన్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై మరింత తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఇక ఇదే విషయంపై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది అంటూ డివిలియర్స్ వ్యాఖ్యానించారు. రోహిత్, బుమ్రా లాంటి సీనియర్లు ఉన్నచోట అలాంటి ధోరణి పనికిరాదు అంటూ హితవు పలికారు. తన కెప్టెన్సీ అలాగే ఉండాలని.. ధోని మాదిరి చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. అయితే యువకులు ఎక్కువగా ఉండే గుజరాత్ లో ఇది పనిచేస్తుంది. కానీ అనుభవజ్ఞులు ఉండే ముంబై ఇండియన్స్ లో మాత్రం అందరూ దీనిని అంగీకరించారు అంటూ చెప్పుకొచ్చాడు ఎబి డివిలియర్స్. కాగా డెవిలియర్స్ గతంలో ఆర్సిబి తరఫున ఆడాడు అనే విషయం తెలిసిందే.