ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 లో భాగంగా మొదట సీజన్ ప్రారంభం మ్యాచ్ లలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు అద్భుతమైన ఆట తీరని కనబరిచింది. దానితో ఈ సీజన్ లో ఈ జట్టు సూపర్ పెర్ఫార్మెన్ ను ఇచ్చి చాలా ఈజీగా ప్లే ఆప్స్ కి చేరుతుంది అని ఎంతోమంది భావించారు. కానీ ఆ తర్వాతనే ఈ జట్టు ఆట తీరు మొత్తం మారిపోయింది. బ్యాటర్స్ మొదట బ్యాటింగ్ చేసే అద్భుతమైన పరుగులను సాధించి ఆపోజిట్ టీమ్ కు పెద్ద టార్గెట్ ను ఇచ్చినప్పటికీ బౌలర్లు విపరీతంగా ఫెయిల్ అవ్వడంతో ఈ జట్టు వరుసగా ఓటమిలను చవి చూసింది. దానితో ఈ జట్టు ఈ సీజన్ లో ప్లే ఆప్స్ కి వెళ్లడం అసంభవం అన్న స్థాయికి చేరిపోయింది.

ఇక ఆ తర్వాత నుండి ఈ జట్టు పుంజుకొని అద్భుతమైన ఆట తీరును కనపరచడం మొదలు పెట్టింది. ఇప్పటివరకు ఈ జట్టు ఈ సీజన్ లో 13 మ్యాచులు ఆడగా అందులో ఆరు మ్యాచులలో గెలుపొంది , ఏడింట్లో ఓడిపొయి 12 పాయింట్లతో పాయింట్లు పట్టికలో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే ఈ జట్టుకు ఇంకా కేవలం ఒకే మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్ లో గనుక ఈ జట్టు అద్భుతమైన ఆట తీరును కనబరిచి గెలుపొందినట్లు అయితే ప్లే ఆప్స్ కి వెళ్లే అవకాశం ఉంది.

కాకపోతే ఈ జట్టుకు వాతావరణం పెద్ద షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జట్టు శనివారం రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ రోజు వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది. కర్ణాటకలో ద్రోహి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఒక వేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ కనుక రద్దు అయినట్లు అయితే బెంగళూరు జట్టు ఈ సీజన్ ప్లే ఆప్స్ ఆశలు గల్లంతు అయినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb