ఇక నేడు చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు భారీ తేడాతో విజయం సాధిస్తే చెన్నైని వెనక్కి నెట్టి ఇక పాయింట్లు పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఏం జరగబోతుంది అనే విషయంపైనే ఉత్కంఠ నెలకొంది. రెండు కూడా పటిష్టమైన టీమ్స్ కావడం ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉండడంతో ఈ మ్యాచ్ లో బంతికి బ్యాట్ కి మధ్య హోరాహోరీ సమరం జరగడం ఖాయం అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు క్రికెట్ విశేషకులు. అదే సమయంలో ఇక చిన్న స్వామి స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ కి వర్షపు ముప్పు కూడా పొంచి ఉంది అన్న విషయం తెలిసిందే.
అయితే చిన్నస్వామి స్టేడియంలో సబ్ ఎయిర్ సిస్టం ఉండడంతో ఆర్సిబి, సీఎస్కే మ్యాచ్ పై ఆశలు చిగురిస్తున్నాయి. రాత్రి 10 తర్వాత వర్షం దగ్గిన కొన్ని నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేయవచ్చు. అప్పుడు ఐదు ఓవర్ల మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. సాధారణంగా 20 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. చెన్నై పై 18 పరుగులు తేడాతో విజయం సాధించడం లేదంటే ఆ జట్టును 18.1 లోనే ఓడించడం చేయాలి. మరి ఐదోవర్లలో మ్యాచ్ జరిగితే.. గణాంకాలు మరోలా ఉన్నాయి. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసి బెంగళూరు జట్టు 5 ఓవర్లలోనే 80 పరుగులు చేస్తే.. చెన్నైని 62 పరుగులకే పరిమితం చేయాలి. ఒకవేళ చేదనలో అయితే 3.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. లేదంటే ఆర్సీబీ గెలిచిన చెన్నై ప్లే ఆఫ్ కు వెళుతుంది.