చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ ఐపిఎల్ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నాటి నుంచి అటు ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రతి సీజన్ కు ముందు ధోని రిటైర్ అవుతున్నాడు అంటూ న్యూస్ రావడం.. ఇక ధోని మాత్రం ప్రతి సీజన్లో కొనసాగడం జరుగుతు వస్తుంది.


 అయితే ఇక ఈ సీజన్ తర్వాత మాత్రం ధోని తప్పకుండా రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అని అందరు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా తప్పకుని రుతురాజు గైక్వాడ్ కి కెప్టెన్సీ అప్పగించాడు. ఇక తన ఆధ్వర్యంలోనే రుతురాజ్ కు కెప్టెన్సీ మేలుకువలు కూడా నేర్పించాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయిన చపాక్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో మైదానంలో తిరుగుతూ అటు అభిమానులకు అభివాదం కూడా చేశాడు. ఇదంతా చూస్తుంటే ఈసారి ధోని రిటైర్మెంట్ ఖాయం అంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఇదే విషయం గురించి అటు చెన్నై కోచ్ మరోలా స్పందించారు.



 మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్ తర్వాత రిటైర్ అవుతాడా అంటూ ప్రశ్నించగా.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ హస్సి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని అన్ని విషయాలను రహస్యంగా ఉంచుతారు. రిటైర్మెంట్ గురించి అందరికీ ఎంత తెలుసొ నాకు కూడా అంతే తెలుసు. జట్టులోని ప్రతి ఒక్కరూ ఆయన ఇంకొన్ని సీజన్లు ఆడాలని కోరుకుంటున్నారు. అయితే ఒక్క మోకాలి గాయం సమస్య తప్ప ఆయన బ్యాటింగ్ అద్భుతంగా సాగుతోంది. నెట్ ప్రాక్టీస్ సమయంలో కూడా అందరికంటే ఎక్కువగానే సాధన చేస్తున్నాడు. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో ఆయన చేతిలోనే ఉంది అంటూ సీఎస్కే బ్యాటింగ్ కోచ్ హస్సి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl