మరి కొన్ని రోజుల్లో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. టి20 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఈ వరల్డ్ కప్ టోర్నీకి వెస్టిండీస్ యూఎస్ దేశాలు ఇక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇప్పటికే ఆయా దేశాలలో వరల్డ్ కప్ మ్యాచ్లు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే జూన్ 1వ తేదీ నుంచి ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఈసారి వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచేందుకు  ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్.. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరిలో కూడా ఒక అనుమానం కలుగుతుంది. సాధారణంగా క్రికెట్ కి ఎక్కువగా ఆదరణ ఉన్న దేశాలలో ఇక ప్రపంచకప్ టోర్నీలు నిర్వహించటం ఇప్పుడు వరకు చూశాం. కానీ పెద్దగా అటు క్రికెట్ కి ఆదరణ లేని అమెరికాలో ఎందుకు ఈసారి అటు వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారు. స్పెషల్గా అక్కడ వరల్డ్ కప్ మ్యాచ్ లు పెట్టడానికి గల కారణం ఏంటి అన్నది చాలామందిలో ఉన్న ప్రశ్న.


 అంతేకాకుండా ఇలా యూఎస్ఏలో వరల్డ్ కప్ నిర్వహించడం ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ ని కూడా ఇప్పటికే ఆశ్చర్యానికి కలిగిస్తోంది. అయితే కొత్త దేశాలకు క్రికెట్ విస్తరణ.. కొత్త మార్కెట్ల అన్వేషణ ఒలంపిక్స్ లో క్రికెట్ చేరిక వంటి లక్ష్యాలతోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది. అంతేకాకుండా యూఎస్ లో ఎక్కువ మంది క్రికెట్ ను ఆరాధించే భారతీయులు ఉండటం కూడా ఇలా యూఎస్ఏ లో వరల్డ్ కప్ మ్యాచ్లు నిర్వహించడానికి కారణమైంది అని తెలుస్తుంది. అయితే ఎక్కువ దేశాలలో క్రికెట్ విస్తరించడం వల్ల ఒలంపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టేందుకు అవకాశాలు మరింత మెరుగవుతాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: